హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒక ముద్దను ఎన్నిసార్లు నమలాలో తెలుసా?

ఆఫీస్ లేదా ఏదైనా పని హడావిడిలో చాలామంది లంచ్‌ను కేవలం 5 నిమిషాల్లోనే ముగించేస్తుంటారు. అయితే, ఇలా గబగబా తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం మనం తినే ప్రతి ముద్దను నోట్లోనే కనీసం 32 సార్లు నమలాలని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేయడానికి కనీసం 20 నిమిషాల సమయం కేటాయించాలి. ఆహారం ద్రవంగా మారేలా బాగా నమిలి మింగడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.