హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ

JGL: జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవల తీరును జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన, రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలో వేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.