RR: మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు. జిల్లెల్లగూడలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. అర్హులైన విద్యావంతులందరి ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేయించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే


