హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దాం: బుగ్గన

NDL: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. డోన్‌లోని వైసీపీ కార్యాలయంలో 3, 4, 7, 10వ వార్డుల ఇన్‌ఛార్జుల ఆధ్వర్యంలో కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. పార్టీ కార్యక్రమాలు, స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.