హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ రిటైర్‌మెంట్‌ వెనక్కి తీసుకోవాలి: కపిల్ దేవ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు, T20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఇప్పటికైనా కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకోవాలని సూచించాడు. విరాట్ మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, మరో రెండు, మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందన్నాడు. WIతో తొలి ODIలో కోహ్లీ 139 రన్స్ చేయడంపై కపిల్ ప్రశంసించాడు.