హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్ కుస్తీలో భారత్‌కు పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు కుస్తీ విభాగంలో పతకం లభించింది. పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో సునీల్.. ఫిలిప్పీన్స్‌కు చెందిన రెజ్లర్‌పై 9-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించాడు. కాగా, ఆసియా క్రీడల్లో గ్రీకో-రోమన్ విభాగంలో సునీల్ కుమార్ కాంస్యం గెలుచుకోవడం విశేషం.