హైదరాబాద్: 28°C
తెలంగాణ

మామిడిమాడకు యూనియన్ బ్యాంక్ మంజూరు

WNP: ఖిల్లా ఘనపూర్ మండలంలోని మామిడిమాడ గ్రామానికి యూనియన్ బ్యాంక్ మంజూరైంది. సర్పంచ్ బాల్ లింగం విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎంపీ మల్లు రవితో మాట్లాడి బ్యాంకు మంజూరుకు కృషి చేశారు. దీంతో గ్రామంతో పాటు పరిసర తాండాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంక్ మంజూరుపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.