హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ రథంతో పొడి చెత్త సేకరణ

ప్రకాశం: వెలిగండ్ల (మం) గన్నవరంలో బుధవారం స్వచ్ఛ రథం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి పొడి చెత్తను సేకరించి, ప్రతిగా నిత్యావసర వస్తువులను అందించారు. ఎంపీడీవో ఆర్. గంగాధర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రాంప్రసాద్, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.