హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ దర్శనం టికెట్ల విక్రయాలు ప్రారంభం

CTP: వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. గురువారం ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్లు అందుబాటులోకి తెచ్చారు. వీటి విక్రయాలను ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని కోరారు.