హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

KRNL: మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని, 12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. డోన్‌లో పాత మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పీఆర్‌సీ, డీఏ, మధ్యంతర భృతి వర్తింపజేయాలని కోరారు. కమిషనర్ కసిరెడ్డి నరేష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.