BPT: తోటవారిపాలెం స్వర్ణ పంచాయతీలో 'స్వచ్ఛత హీ సేవా' వేడుకలు జరిగాయి. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు అందించి, గ్రామ పారిశుధ్యంలో వారి సేవలను గుర్తిస్తూ.. సన్మానించారు. గ్రామాభివృద్ధిలో కీలకమైన కార్మికులను గౌరవించాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మేడికొండ భారతి, జనసేన నాయకుడు శివరాం ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు సన్మానం


