PDPL: ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి చికిత తానిపర్తి సత్తా చాటారు. ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన జట్లలో భాగమై మెరిశారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన చికితకు చిన్నప్పటి నుంచే ఆర్చరీపై ఆసక్తి. తండ్రి శ్రీనివాసరావు ఆమెను ప్రోత్సహించారు. 2022లో సోనిపట్ ఆర్చరీ అకాడమీలో చేరిన ఆమె 2025 ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించారు.
తెలంగాణ
ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి సంచలనం..!


