హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చల్లారెడ్డిపాలెం సచివాలయానికి సబ్సిడీ ఎరువులు

BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు చల్లారెడ్డిపాలెం సచివాలయానికి సబ్సిడీ యూరియా, డీఏపీ ఎరువులు చేరుకున్నాయి. పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కీర్తి పూర్ణ ఆధ్వర్యంలో వీటిని అందుబాటులో ఉంచారు. అవసరమైన రైతులు ఆధార్ కార్డ్, పొలం పత్రాల జిరాక్స్‌తో సచివాలయ వ్యవసాయ సహాయకుడిని సంప్రదించి ఎరువులు పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.