హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిసాన్ మేళాను సందర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే

ASF: రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సమష్టి కృషి అవసరమని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. బెల్లంపల్లి మండల కేంద్రంలో KVK ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాను ఎమ్మెల్యే బుధవారం సందర్శించారు. రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.