హైదరాబాద్: 28°C
తెలంగాణ

టౌన్ ప్లానింగ్‌లో సిబ్బంది కొరత.. సేవలకు బ్రేక్!

SRPT: కోదాడ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత నెలకొంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ లోపించింది. జూనియర్ అసిస్టెంట్లను వార్డు ఇన్‌చార్జిలుగా నియమించడంతో ఒక్క టీపిబీఓపైనే కార్యాలయ, ఫీల్డ్ విధుల భారం పడింది. భవన అనుమతులు, అక్రమ నిర్మాణాల ఫిర్యాదులతో ఒత్తిడి పెరుగుతోందని అధికారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.