ATP: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సందర్శించారు. బీకాం ప్రథమ సంవత్సరం తరగతికి వెళ్లిన ఆయన, అధ్యాపకుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అవమానాలను అవకాశాలుగా మలుచుకుంటే విజయం సాధించవచ్చని పిలుపునిచ్చారు. గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, కృషి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం: మంత్రి


