హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడిదాసుకు రూ.2.02 లక్షల CMRF సాయం

కూనసీమ: మలికిపురం మండలం పడమటిపాలెంకు చెందిన నల్లి పైడిదాసుకు వెన్నెముక వ్యాధి చికిత్స కోసం CMRF ద్వారా రూ.2,02,754 విలువైన LOC మంజూరైంది. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి LOC మంజూరుకు చర్యలు తీసుకున్నారు.