CTR: పుంగనూరు గూడూరు పల్లె సమీపంలోని జగనన్న కాలనీలో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని బీజేపీ మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్ బుధవారం కోరారు. 65 మంది నివాసం ఉంటున్న కాలనీలో సమస్యలు అధికంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీ, మౌలిక వసతులపై కాలనీవాసులు అధికారులకు విన్నవించుకున్నా పరిష్కరించడం లేదని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి'


