MDK: చేగుంట మండలం గొల్లపల్లిలో బుధవారం ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం పద్మ, ఆశా కార్యకర్తలతో కలసి విస్తృతంగా ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటా పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తొట్టెలు, ప్లాస్టిక్ బ్యారెళ్లలో నీరు నిల్వ ఉంటే దోమల లార్వా చేరి వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలుపాలన్నారు.
తెలంగాణ
'సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం'


