హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగన్నకు నివాళులర్పించిన ఎమ్మెల్యే విజయుడు

GDWL: రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామానికి చెందిన 2వ వార్డు మెంబర్ రంగన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నేడు వారి స్వగృహానికి వెళ్లి, రంగన్న భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.