WGL: జిల్లాలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ప్రధానార్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే ఉమ్మడి జిల్లా పరిధి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
భక్తులతో కిటకిటలాడిన భద్రకాళి ఆలయం


