AKP: కోటవురట్ల మండలంలో రహదారుల నిర్మాణానికి రూ. 11.85 కోట్లు మంజూరైనట్లు మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు బుధవారం తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో 112 సీసీ రోడ్లు నిర్మాణానికి రూ. 6.37 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 13 బీటీ రోడ్లకు రూ. 5.48 కోట్లు మంజూరయ్యానన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల అభివృద్ధికి నిధుల మంజూరు


