AKP: నర్సీపట్నం మండలంలో ఉన్న 54 ఎంపీపీ పాఠశాలలు, యూపీ పాఠశాలలో, జడ్పీ హైస్కూల్లో ఒక్క పాఠశాల తప్ప అన్నిట్లోనూ విద్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని MEO సిహెచ్. తలుపులు తెలిపారు. వేములపూడి శివారు పంచాయతీ పెద్ద ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక ఎన్నిక వాయిదా వేశామని తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పరగూడెంలో పాఠశాల ఎన్నిక వాయిదా


