హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైల్వే ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలి'

కోనసీమ వాసుల కల అయిన కోటిపల్లి-నరసాపురం రైల్వే ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని రైల్వే రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం అమలాపురంలో జరిగిన ప్రజా సంఘాల భేటీలో వారు పాల్గొని మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో గత, నేటి పాలకులు అలసత్వం వహించారని విమర్శించారు.