హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈర్నపాడులో దంపతుల ఆత్మహత్య

NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో బుధవారం ఉప్పరి గోపాల్, రమణమ్మ దంపతులు తమ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. దంపతులు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.