హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాశీ–తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

GNTR: కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. MP కట్నీ జంక్షన్ సమీపంలో రైలు ఆగగానే ముసుగులు ధరించిన 20 మంది దుండగులు బోగీల్లోకి చొరబడ్డారు. ప్రయాణికులను కత్తులతో బెదిరించి, గోల్డ్, నగదు దోచుకెళ్లారు. బాధితుల్లో తెనాలికి చెందిన 21 మంది భక్తులు ఉండగా, వారు తెనాలి GRP పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.