హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మట్టి పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం

AKP: అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం ముందస్తు సమాచారం లేకుండా గ్రామసభ నిర్వహించకుండా మట్టి పరీక్షలు చేపట్టడంపై స్థానికులు, మత్స్యకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను సంప్రదించకుండా రహస్యంగా పరీక్షలు నిర్వహించడం ఏకపక్ష చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ విధానం స్థానిక ప్రజల హక్కులను కాలరాసేలా ఉందన్నారు.