హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్ల కోసం భారీ దరఖాస్తులు

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త చేయూత పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నమోదైనట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో 27,772, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,843 దరఖాస్తులు వచ్చాయి. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. అయితే వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.