హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఆదోని వాసి మృతి

KRNL: ఆదోనికి చెందిన టైలరింగ్ మెటీరియల్ వ్యాపారి మహబూబ్ బాషా ఢిల్లీలో మృతి చెందారు. హజరత్ నిజాముద్దీన్ దర్గా ఉరుసు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన.. బుధవారం ఉదయం 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఢిల్లీ నుంచి ఆదోనికి తీసుకొస్తున్నారు. ప్రతి ఏడాది ఆదోని నుంచి వందలాది మంది ఊరుసు కోసం ఢిల్లీ వెళ్తుంటారు.