హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్..!

శ్రీకాకుళం జిల్లాలో 22 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ మేరకు సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత సాధించి, 25-45 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 చొప్పున జీతం అందించనున్నారు. అర్హులైన వారు స్థానిక PHCలు, UPHCలలో అప్లై చేసుకోవచ్చు.