హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శిథిల భవనంపై గ్రామస్తుల ఆందోళన

ASR: రాజవొమ్మంగి మండలం శరభవరంలో పాత రేషన్ డిపో భవనం 40ఏళ్లకు పైగా ఉండటంతో శిథిలావస్థకు చేరిందని గ్రామస్థులు తెలిపారు. ఎప్పుడు కూలిపోతుందో తెలీని స్థితి ఉందన్నారు. రాత్రివేళ మూగజీవాలు భవనంలోకి వెళ్తుండగా, సాయంత్రం పాఠశాల విద్యార్థులు ఆటల కోసం లోపలికి వెళ్తున్నారన్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి భవనాన్ని తొలగించాలని పెసా వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు కోరారు.