హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గేదెలను ఢీకొన్న పోలీసుల కారు

NLR: సీతారామపురం మండలంలోని చిన్నాగంపల్లి చెరువుకట్టపై గేదెలను కారు ఢీకొన్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. వరికుంటపాడు మండలంలోని రామాపురం వద్ద పల్లెపండగ విధులు ముగించుకుని పోలీసులు మార్కాపురం జిల్లా పామూరు నుంచి కడప జిల్లా పోరుమామిళ్లకు కారులో వెళుతున్నారు. చెరువు కట్ట వద్దకు వచ్చేసరికి రహదారిపై వెళుతున్న గేదెలను ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.