SKLM: సారవకోట మండలం ముగుపురం మండల పరిషత్ పాఠశాల ఛైర్మన్‌గా ఎన్నికైన రాయల జగదీశ్వరరావు బుధవారం మబగాం క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల ఛైర్మన్‌ను సత్కరించిన కృష్ణదాస్


