PPM: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇవాళ క్లస్టర్-1 స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 వరకు జరిగే పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పలు క్రీడా విభాగాల్లో పాల్గొంటున్నారు. ముగింపు వేడుకలు అక్టోబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వీర్ సింగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏకలవ్య పాఠశాలలో క్రీడా సందడి


