హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం!

CTR: పాలసముద్రం మండలంలోని నరసింహాపురం, తిరుమలరాజుపురం, గంగమాంబాపురం, కోదండరామాపురం పంచాయతీల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. టీవీఎన్ఆర్ పురంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది. వర్షంతో భూగర్భ జలమట్టం పెరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఉపశమనం లభించింది.