హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు'

ATP: గుంతకల్లు పట్టణంలోని పలు దుకాణాలను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగిస్తున్న అంబిక జనరల్ స్టోర్ యజమానికి రూ.10,000 జరిమానా విధించి ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగించిన, నిల్వ ఉంచిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.