GNTR: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన ఆధ్వర్యంలో తాడికొండ మండల పరిషత్తు కార్యాలయంలో నిరుద్యోగ యువతకు మంగళవారం ఉచిత నైపుణ్య శిక్షణ నిర్వహిచారు. 126మందికి నైపుణ్యాలపై శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించినట్లు ఎంపీడీవో సమతావాణి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నైపుణ్యం వెబ్‌సైట్ ద్వారా వివరాల నమోదు చేసుకుని ఎంపిక ప్రక్రియలో పాల్గొనేలా మార్గనిర్దేశనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ


