హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొలుసు దొంగతనాలు.. తనిఖీలు తీవ్రతరం

ATP: జిల్లాలో గొలుసు దొంగతనాల నివారణకు ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు తీవ్రతరం చేశారు. రద్దీ లేని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని, బంగారు ఆభరణాలను కప్పుకుని వెళ్లాలని సూచించారు. కొత్త వ్యక్తులు చిరునామాలు అడిగితే దూరం పాటించాలని తెలిపారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే ఉచిత నంబర్ 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు.