హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. వ్యక్తి అరెస్టు

WGL: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దశలవారీగా సుమారు రూ.80 లక్షలు వసూలు చేసి మోసం చేసిన మార్క శివకుమార్‌ను పర్వతగిరి పోలీసులు అరెస్టు చేశారు. జఫర్‌గడ్‌ మండలం తిమ్మంపేటకు చెందిన శివకుమార్‌.. గడ్డపారతండాకు చెందిన బోడ రవికి ఉద్యోగం ఇప్పిస్తానని పలుమార్లు డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.