హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా వల్మిడి–తీగారం రోడ్డు

JN: వల్మిడి–తీగారం రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి చాలాకాలమైనా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారి గుంతలు, బురదమయంగా మారడంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి దుస్థితితో రాకపోకలకు అవస్థలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు.