హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిద్రలోనే పదోతరగతి విద్యార్థి మృతి

TPT: చంద్రగిరి మండలంలో విషాద ఘటన జరిగింది. అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలానికి చెందిన చక్రధర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి చంద్రగిరిలో ఓ ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి చదువుతూ హాస్టల్ ఉంటున్నాడు. రాత్రి గదిలో పడుకోగా ఉదయం నిద్రలేవలేదు. గమనించిన వార్డెన్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.