హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇనమనమెల్లూరులో పల్లెనిద్ర కార్యక్రమం

ప్రకాశం: మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామంలో అక్టోబర్ 1న జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. గ్రామస్థులు తమ సమస్యలపై కలెక్టర్‌కు నేరుగా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. పల్లెనిద్ర కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.