హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాఫీ విస్తరణ కొరకు నోటిఫికేషన్ విడుదల

ASR: కాఫీ బోర్డు మినుములూరు సీనియర్ లైజన్ ఆఫీసర్ కార్యాలయం నుంచి కాఫీ విత్తనాల పంపిణీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న రైతులు నవంబర్ 13, 2026లోగా ఇండెంట్ నమోదు చేసుకోవాలి. కిలోకు రూ.500 ముందస్తు చెల్లించాలి. అరకు, చింతపల్లి, మినుములూరు కాఫీ బోర్డు కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. విత్తనాల పంపిణీ లభ్యతపై ఆధారపడి ఉంటుంది.