E.G: కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బుధవారం తెల్లవారుజామున లోడ్‌తో వెళ్తున్న ఇటుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కాపవరం గ్రామానికి చెందిన సోడసాని ప్రసాద్ (40) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇటుక ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి


