CTR: నిండ్ర మండలంలోని అయ్యారు కండ్రిగలో తేనెటీగల దాడి చేయడంతో మునస్వామి యాదవ్ (62) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మునస్వామి యాదవ్ తన మామిడి తోట వద్దకు వెళ్లగా చెట్టుకున్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.
ఆంధ్రప్రదేశ్
తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి


