SS: ధర్మవరం పట్టణంలోని 8వ వార్డులో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు నూతన బోరు తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. స్థానికుల విజ్ఞప్తితో మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు, బీజేపీ నాయకుడు జూటూరు వెంకటేష్ ఈ పనులను పర్యవేక్షించారు. కేవలం 100 అడుగుల లోతులోనే 3 ఇంచుల నీరు పడటంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్య పరిష్కరించిన మంత్రి


