హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదు'

ELR: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ద్వారకాతిరుమల మాజీ ఎంపీపీ భర్త బొండాడ వెంకన్నబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నేతలు ఖండించారు. జనసేన గోపాలపురం ఇన్‌ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ.. వెంకన్నబాబు స్థాయి మరచి వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. వెంకన్నబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఫిర్యాదు చేశారు.