హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతి గృహాలను ప్రారంభించిన మంత్రి

మన్యం జిల్లా సీతం పేటలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆడలి వ్యూ పాయింట్ వద్ద రూ. 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వసతి గృహాలను నిన్న మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి అందాలను తిలకించేందుకు ఈ కాటేజ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.