హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భుజంగాసనం వల్ల కలిగే ఉపయోగాలు

భుజంగాసనం (కోబ్రా పోజ్) వెన్నెముకను బలోపేతం చేసి, దానికి మంచి వశ్యతను చేకూరుస్తుంది. నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పొట్ట కండరాలను సాగదీసి, ఉదర అవయవాలను ప్రేరేపిస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఛాతీ భాగాన్ని విస్తరింపజేసి, ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.