హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మిడ్-మార్నింగ్ స్నాక్స్‌లో ఇవి తింటున్నారా?

బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో (10.30AM-12PM) ఆకలి వేయడం సహజం. అప్పుడు చాలామంది చిప్స్, బిస్కెట్లు లాగిస్తుంటారు. కానీ వాటిలోని మైదా, చెడు కొవ్వులు ఆరోగ్యానికి హానికరం. వాటికి బదులుగా ఒక పండు, కాజు, గుప్పెడు వేరుశనగలు, వాల్ నట్స్ తీసుకోవడం ఎంతో మేలు. గ్లాసు మజ్జిగ తాగినా తక్షణ శక్తి వస్తుంది. ఈ మార్పుతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.